India / Entertainment
అక్కడ నోరు జారాడు.. ఆమె ‘సారీ’ అంది!
10:59 AM on 06th September, 2013

బాలీవుడ్‌కి అసలే కొత్త.. తెలిసీతెలియకుండా ఏదైనా కామెంట్ చేస్తే చిక్కులు తప్పవు! దక్షిణాది హీరో చెర్రీకి ఇటీవల ఇలాంటి ఇరకాట పరిస్థితే ఎదురైంది. ఓ ఛానెల్ నిర్వహించిన ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ షో ఫినాలే సెట్స్‌పై రామ్‌చరణ్ కూడా ఆ షోని ఎంజాయ్ చేస్తున్నాడు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్లయిన విశాల్, శేఖర్ - ఆ షో న్యాయ నిర్ణేతలు! వీళ్లు ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారని మెచ్చుకున్న చెర్రీ అంతటితో ఆగిపోతే బాగుండేది. కానీ ‘ముఖ్యంగా ‘లుంగీ డ్యాన్స్’ అద్భుతంగా వుంది’ అని కితాబిచ్చాడట! దీంతో విశాల్, శేఖర్‌లు ముఖాముఖాలు చూసుకున్నారు.

అయితే- సెట్స్‌మీదే వున్న ప్రియాంక చోప్రా పరిస్థితిని మేనేజ్ చేసింది. చిరునవ్వుతో లైట్‌గా వాళ్లకి ‘సారీ’ చెప్పి - ‘జంజీర్/తుఫాన్’ సినిమాలోని తన హీరోని రక్షించింది. నిజానికి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో లుంగీ సాంగ్‌ని కంపోజ్ చేసింది విశాల్, శేఖర్‌లు కాదు! సింగర్ యోయో హానీసింగ్! ఈ లుంగీ సాంగ్ పైనా, ఈ సినిమాలో హానీసింగ్ మ్యూజిక్ ‘ప్రమేయం’పైనా వివాదం రేగిన సంగతి తెలిసిందే! హానీసింగ్ జోక్యంపై విశాల్, శేఖర్‌లు తమ ట్విటర్‌లో అసంత‌ృప్తిని వ్యక్తం చేశారు కూడా! ఇక.. సెట్స్‌పై తన వల్ల జరిగిన పొరబాటును ఆలస్యంగా గుర్తించిన రామ్‌చరణ్ - వాళ్లిద్దరికీ క్షమాపణ చెప్పాడు.

 
 
 
Related News