AP and TS / Entertainment
రీ ఎంట్రీతో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా..?
12 days ago

లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి సినిమాలు చేయక చాలాకాలం అయ్యింది. 2006లో  వచ్చిన ‘నాయుడమ్మ’నే ఆమె చివరి సినిమా. ఆ తరువాత తన ఫోకస్ మొత్తం పాలిటిక్స్ మీదే పెట్టిన ఆమె.. మూవీలకు దూరంగా వుంటూ వచ్చింది. ‘కర్తవ్యం’ , ‘ఒసేయ్ రాములమ్మ’ లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో రికార్డ్స్ క్రియేట్ చేసిన విజయశాంతి.. లాంగ్ గ్యాప్ తరువాత రీ-ఎంట్రీ ఇవ్వాడానికి రెడీ అవుతోందని సమాచారం. ఇందుకోసం ఆమె భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. రాములమ్మ తన రీ-ఎంట్రీ మూవీని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మళయాళం, హిందీలో ఒకేసారి తెరకెక్కించేలా ప్రణాళిక రచిస్తోందట. ఒకవేళ అదే నిజమైతే.. రీ-ఎంట్రీతో విజయశాంతి రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. పొలిటికల్ కెరీర్ ఒక్కసారిగా డౌన్‌ అవడంతో.. ఆమె ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు.

 
 
 
Related News

JournalistDiary