అన్యాయంగా చంపేశారు

ఈ వాల్డ్ లోనే అతి పాత ‘ రాతి యుగం ‘ మనుషులు వాళ్ళు. ఈ నాగరిక ప్రపంచానికి దూరంగా.. తమ లోకమేదో తాము బతుకుతున్న జాతి వారిది. బయటివారెవరైనా వచ్చినా, తమ భూభాగంలోకి ఎవరు పరాయి వ్యక్తులు అడుగు పెట్టినా.. సహించలేరు. సుమారు 30 వేల ఏళ్ళుగా ఈ తెగ ఆదిమవాసులది విచిత్రమైన జీవితం. అడవుల్లో తిరిగే జంతువులూ, సముద్ర జీవాలే వాళ్ళ ఆహారం. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెల్ అనే ద్వీపంలో నివసిస్తున్న ఈ తెగవారు ఈ మధ్య ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు. కారణం.. తమను క్రిస్టియానిటీలో చేర్చేందుకు, కనీసం కాస్తయినా నాగరికానికి దగ్గర చేసేందుకు తమ ద్వీపానికి చేరుకున్న… అమెరికన్ క్రిస్టియన్ మిషనరీకి చెందిన జాన్ అలెన్ చౌ అనే 26 ఏళ్ళ యువకుడ్ని అతి పాశవికంగా విషపు బాణాలు ప్రయోగించి చంపేశారు. పైగా అతడి దేహాన్ని ఓ తాడుతో కట్టి సముద్రపు ఒడ్డు పొడవునా లాక్కుపోయారు. వీరికోసం ఓ ఫుట్ బాల్ ను, మరికొన్ని వస్తువులను జాన్ తీసుకెళ్ళాడు. కానీ..తాము ఒంటరిగా బతుకుతున్నామని, తమకు బయటి వ్యక్తులతో సంబంధమే అక్కర్లేదని చెబుతున్న వీరు.. జాన్ చేతిలో పట్టుకున్న బైబిల్ మీద ఒక్కసారిగా బాణాలు వదిలారు. ఆ తరువాత అతగాడు చనిపోయేంతవరకు వీటిని ప్రయోగిస్తూనే వచ్చారు. వీరి చేతిలో తనకు మరణం తప్పదని ముందుగానే భావించాడేమో …జాన్ తాను బయల్దేరే ముందు.. తన కుటుంబ సభ్యులతో..తనకేదైనా జరిగితే ఈ తెగవారిని క్షమించేయాలని కోరాడట. వెనుకబడిన ఆదిమ జాతులను సంస్కరించి..వారిని ఈ సివిలైజ్డ్ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న జాన్ ఆశలు ఆవిరే అయ్యాయి. ఈ నెల 16 న ఈ యువకుడ్ని వాళ్ళు హతమార్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *