ఆకాశంలో 'చంద్ర ధనుస్సు'.. అంతకుమించి..!

ఆకాశంలో 'చంద్ర ధనుస్సు'.. అంతకుమించి..!

ఒకటే ఫ్రేమ్ లో రెండు అరుదైన వాతావరణ అద్భుతాలు..! ఒకవైపు అందమైన హరివిల్లు, మరోవైపు ఆకాశంలో సహజంగా ఏర్పడే భిన్నమైన విద్యుల్లత..! స్వీడన్లో ఒక శీతలప్రాంతంలోని రిసార్ట్ లో.. కెమెరాకు చిక్కిన ఈ పర్యావరణ అద్భుతం.. ఇప్పుడు గ్లోబల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్యుడి నుంచి విడిపడిన భారీసైజు పార్టికల్స్ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు ఏర్పడేవి ‘నార్తర్న్ లైట్స్’. ఇవి ఎప్పుడో తప్ప కనిపించవు. ఆకుపచ్చ-పసుపు రంగులు కలిసిన ఈ అందమైన వెలుగురవ్వలు భూఉపరితలానికిచేరే సందర్భంలో మిణుగురు పురుగుల్లా మెరుస్తాయి. చంద్ర ధనుస్సుతో పాటు ఈ నార్తర్న్ లైట్స్ కూడా ఒకేసారి సంభవించడం ఒక యాదృచ్చిక ఘటన అయితే.. దాన్నిసరైన సమయంలో క్లిక్ కొట్టడం మరో ఆసక్తికర అంశం. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్న రేర్ ఫోటో.. మీ కోసం!

 

(ఆకాశంలో ఇంద్రధనస్సు పగలు మాత్రమే ఏర్పడేది. ఈ చంద్రధనుస్సు మాత్రం రాత్రిపూట కనిపిస్తుంది. చంద్రుని కాంతి సముద్ర తలం మీద పడినప్పుడు దానిప్రతిబింబం మళ్ళీ ఆకాశంలో కనిపిస్తుంది.. దాన్నే చంద్రధనుస్సు అంటాం.)

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *