ఆర్ఆర్ఆర్ కోసం 4డీ టెక్నాలజీ

ఆర్ఆర్ఆర్ కోసం 4డీ టెక్నాలజీ

స్టార్ రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకలు చాలానే వుంటాయి. నటీనటుల దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు ప్రతీది వెరైటీగా వుంటాయి. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు జక్కన్న. అందుకే టెక్నాలజీ పరంగా బాహుబలి సినిమానిప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు. జక్కన్న డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్- ఎన్టీఆర్‌లపై యాక్షన్ సీన్స్ ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటాయని, దాన్ని షూట్ చేసేందుకుఏకంగా 120 కెమెరాలను వినియోగిస్తున్నాడని టాక్. ఆ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో చెర్రీ, ఎన్టీఆర్ హావభావాలు, ముఖ కవళికలు 4డి టెక్నాలజీతో క్యాప్చర్‌ చేస్తారని సమాచారం. ఈ టెక్నాలజీ ద్వారా సినిమా చూస్తున్నప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందట. ఈ విషయం తెలిసి సినీ‌లవర్స్ ఆశ్చర్య పోతున్నారు. ఇండియాలో అత్యంత హైటెక్నాలజీతో రూపొందిన మూవీ 2.0. ఇందులో 3డీ టెక్నాలజీతోపాటు 4డీ సౌండ్ వాడాడు శంకర్. ఐతే, ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దాన్ని మించిపోయేలా ఉండబోతోందట. ఈ ప్రాజెక్టులో టెక్నాలజీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడట జక్కన్న

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *