హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డు మీద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్సుని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక‌లోని బళ్లారి జిల్లాకి చెందినవారు ఆరుగురు వ్యక్తులు ఏలూరు ఆసుపత్రికి వెళ్లారు అక్కడ ట్రీట్‌మెంట్ తర్వాత అంబులెన్సులో తిరుగు పయనమయ్యారు.

కొంగర కలాన్ – రావిలాల ప్రాంతానికి రాగానే వేగంగా వచ్చిన కారు.. అంబులెన్సును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు అంబులెన్స్ నుజ్జనుజ్జయింది. ఈ ఘటనలో అంబులెన్సులోవున్న బొల్లిరెడ్డి వెంకటేశ్వర రావు, ఆయన భార్య సుబ్బలక్ష్మి, ఏలూరుకు చెందిన డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్, హేమచందర్, తొషిష్ మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మనోజ్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *