కేసీఆర్ నిజం ఒప్పుకున్నట్లే!

కేసీఆర్ నిజం ఒప్పుకున్నట్లే!
వెన్నుచూపడమే తెలీని తెరాస యోధుడు ఎందుకిలా చతికిలపడ్డారు? అంటూ తెలంగాణలో కొత్త చర్చ షురూ అయింది. రెండో విడత ఆశీర్వాద సభల్లో జోరుగా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్న కేసీయార్.. ఖానాపూర్ లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్.. పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం నింపేసింది. పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయన్న వార్తల్ని, విశ్లేషణల్ని నిజం చేసేలా కేసీఆర్ చెప్పిన ఆ మాట ఏమిటి? ”టీఆరెస్ ఓడిపోతే నాకొచ్చే నష్టం ఏమీ లేదు.. గెలిపిస్తే పని చేస్తం. లేకుంటే.. ఇంటికాడ పండుకుంటాం” అనే ఆ ఒక్క ముక్క ఇప్పుడు రాష్ట్ర రాజకీయాన్ని కెలికిపారేస్తోంది. ఉద్యమ సమయంలోనూ, పొలిటికల్ జర్నీలోనూ ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న కేసీఆర్.. ఎప్పుడూ ఇలా క్యాడర్ లో నిస్తేజం కలిగే మాటలు చెప్పలేదు. తనకుతానే స్వచ్ఛందంగా అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తుకు వెళ్లారు. కానీ.. ఆ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఆయన మీదే వుంది. ఒకవైపు పార్టీ గెలుపు కోసం కొడుకు, కూతురు, మేనల్లుడు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. తాను మాత్రం ఇలా నీరుగారిపోవడం ఏమిటన్న సందేహం తెరాస లోపల, బైట కూడా చర్చకు తావిచ్చేసింది. ఈ సందర్భాన్ని ‘మహాకూటమి’ కూడా సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. తానన్న మాటకు అర్థం అది కాదని కేసీఆర్ మరో బహిరంగ సభలో క్లారిటీ ఇచ్చేదాకా ఈ ‘బిట్టు’ నడుస్తూనే ఉంటుంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *