రణవీర్ సింగ్, అలియా భట్‌ల తాజా బాలీవుడ్ చిత్రం ‘ గల్లీబాయ్ ‘ హిట్ కొట్టింది. జోయా అక్తర్ దర్శకత్వంలో ఈ నెల 14 న విడుదలయిన ఈ మూవీ ఇండియన్ క్రిటిక్స్, ఇంటర్నేషనల్ ఫిలిం జర్నలిస్టుల నుంచి కూడా ప్రశంసలు అందుకొంది.


మేరీ గల్లీ, రూట్స్ వంటి కిట్‌ర్యాప్ సాంగ్స్ క్రియేటర్ అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు దీన్ని రీమేక్ చేయాలని మెగాహీరో సాయి ధరమ్ తేజ్ డిసైడయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ చిత్రలహరి ‘ మూవీతో బిజీగా ఉన్న తేజ్.. ఈ సినిమా పూర్తయ్యాక.. ‘ గల్లీబాయ్ ‘ రీ-మేక్ మీద ఫోకస్ పెట్టవచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *