గుడ్డులో పసిగుడ్డు... అదే పిల్ల షార్క్

గుడ్డులో పసిగుడ్డు... అదే పిల్ల షార్క్

అమెరికన్ సబ్-మెరైన్ పరిశోధక బృందానికి ఈ మధ్య పోర్టో రికో దగ్గరి దీవుల్లో అరుదైన దృశ్యం  కనబడింది. అక్కడి సముద్ర జలాల్లో లోతైన చోట.. బేబీ  క్యాట్ షార్క్కనబడి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓ గుడ్డు నుంచి బయటపడడానికి అది చేసిన ప్రయత్నాన్ని వాళ్ళు వీడియో తీశారు. సాధారణంగా షార్క్  చేపలు సముద్రపు నాచు, కోరల్స్ పై గుడ్లు పెడతాయి. అలాంటి గుడ్లలో ఒకదాని నుంచి పిల్ల షార్క్ బయటపడేందుకు చాలాసేపు ప్రయత్నించిందని, గాలిని పీల్చుకుని నీటిపైకి వచ్చేందుకు నానాపాట్లు పడిందని ఈ పరిశోధకులు వెల్లడించారు. పిల్లి కళ్ళ వంటి కళ్ళు ఉండడం వల్లే వీటికి క్యాట్ షార్క్ అని వ్యవహరిస్తున్నామని వారు అంటున్నారు.  ఈ రకం చేపలు ఒకమీటరుకు మించి పొడవుకు పెరగవు.. మనుషులకు హాని చేయవు అని అంటున్న వీరు సముద్ర జలాల్లో మరిన్ని వింతలూ, విశేషాల అన్వేషణలో పడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *