ఢిల్లీ కాలుష్యం.. ఇదో నరకం

ఢిల్లీ కాలుష్యం.. ఇదో నరకం

ఢిల్లీని కాలుష్య భూతం కబళిస్తోంది. వాయు కాలుష్యం నగేఅవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత ఏడాదే కాదు..ఈ సంవత్సరం కూడా సేమ్ సీన్.. అక్టోబర్, నవంబర్నెలల్లో ఇది పూర్, వెరీ పూర్, సీవియర్ కేటగిరీలకు చేరుకుంది. దీపావళి తర్వాత అయితే సీవియర్ ప్లస్ ఎమర్జెన్సీ స్థాయికి ‘ ఎగబాకింది ‘. ఈ బెడదను తట్టుకునేందుకుప్రభుత్వం గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్లాన్ (జీఆర్ఏపీ) ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాన్ ప్రకారం.. ఇక్కడి వాతావరణ కాలుష్య నివారణ బోర్డు.. సిటీలోకి ట్రక్కులప్రవేశాన్ని నిషేధించాలని, ఇటుక బట్టీలను మూసివేయాలని, బాదర్పూర్ థర్మల్ విద్యుత్ ప్లాంటును కూడా మూసివేయాలని ప్రతిపాదించారు. ఇంకా ఇలాంటివే మరికొన్నిచర్యలను తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ చర్యలన్నీ తాత్కాలికమేనని, ఇది గాయం తగిలితే బ్యాండ్ ఎయిడ్ వాడడం వంటిదేనని కాలుష్య నివారణకు కృషిచేస్తున్న స్వచ్చంద సంస్థల సభ్యులు అంటున్నారు. ఉదాహరణకు నలభై ఏళ్ళుగా ఢిల్లీకి విద్యుత్తును అందిస్తున్న బాదర్పూర్ ప్లాంట్ ను మూసివేసినా.. కొత్త ప్లాంటులుతామరతంపరగా వస్తూనే ఉన్నాయి. నగరానికి కేవలం 80 నుంచి వంద కి.మీ.దూరంలో ఉన్న ఖుర్జా సూపర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి సుమారు 1320 మెగా వాట్లవిద్యుత్తు అందుతోందని, అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు తమ పంటలను తగులబెడుతున్నారని..వారిని ఎవరు ఆపాలని ఈ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పైగాదీపావళి నాడు టపాకాయలను కాల్చడంపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినా ఎవరూ వాటిని పట్టించుకోని విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ప్లానింగ్ అన్నది పకడ్బందీగాఉంటే ఈ కాలుష్యాన్ని కొంతవరకైనా అదుపు చేయవచ్చునని, మేధావులతో సంప్రదింపులు జరిపి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలని వీరు కోరుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *