ప్రిన్స్ కోసం విలేజ్ ముస్తాబు!

ప్రిన్స్ కోసం విలేజ్ ముస్తాబు!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు విలేజ్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. దీనికి ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 8 కోట్ల రూపాయలు! పల్లెటూరుకి వెళ్లేందుకు అంత ఖర్చుఅవసరమా?

ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి స్టోరీలోకి వెళ్దాం.. మహేష్‌బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న మహర్షి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను పల్లెటూరులో చిత్రీకరించాలని ప్లాన్ చేసింది యూనిట్. దీనికోసం ఏపీ, తెలంగాణల్లోని కొన్ని గ్రామాలను చుట్టొచ్చారట దర్శకనిర్మాతలు. షూట్ చేసే ప్రాంతానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తే, అంతరాయం కలుగుతుందని భావించిందట యూనిట్. ఇందుకోసం భారీ సెట్ వేస్తేబాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చేసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీగా విలేజ్ సెట్ వేస్తోంది యూనిట్. ఫిల్మ్ సిటీలో ఒక ఊరినే క్రియేట్ చేసింది యూనిట్.

మహేష్‌బాబు రైతుగా కనిపించే గ్రామీణ సన్నివేశాలు, ఒకటి లేదా రెండు పాటలను ఈ సెట్‌లో చిత్రీకరిస్తారని అంటున్నారు.

ఫారెన్ నుంచి ఓ విషయమై విలేజ్ వచ్చి అక్కడే కొద్దిరోజులు మకాం వేస్తాడు మహేష్‌బాబు. ఈ షూట్‌లో అల్లరి నరేష్, పూజాహెగ్డే, రావురమేష్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ నటీనటులు కీలకపాత్ర పోషిస్తున్నారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *