బ్రాహ్మణులు మాత్రమే హిందువులా?

బ్రాహ్మణులు మాత్రమే హిందువులా?

కులం, మతం ఈ రెండూ వద్దేవద్దు.. సమసమాజమే ముద్దు.. అంటూ ఒకవైపు సరికొత్త మోడర్న్ సొసైటీ నిర్మాణం జరుగుతుంటే.. మరోవైపు నుంచి కులం కుళ్ళును, మతంమత్తును ఒంటినిండా నింపుకుని ఊరేగుతున్నాయి కొన్ని రాజకీయ తలకాయలు. కులానికి, మతానికి లింకు పెట్టి ఇటీవల మరో కొత్త వితండవాదం షురూ అయింది. ‘పండితులకు మాత్రమే హిందూయిజం గురించి తెలుసు.

 

‘పండితులంటే బ్రాహ్మణులు. వాళ్ళు తప్ప హిందూయిజం గురించి ఎవ్వరు మాట్లాడినా అసంబద్ధం..’ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సీపీ జోషి చేసినవ్యాఖ్యలు ఇప్పుడు తన సొంత పార్టీనే ఇరకాటంలో పడేశాయి. ”ఉమాభారతికి, సాధ్వి ప్రాచీకి హిందూయిజం గురించి ఏం తెలుసు? అసలు నరేంద్ర మోడీది ఏ కులం..” అంటూ ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ హైకమాండ్ ని కూడా కెలికేశాయి.

 

అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన నుంచి కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగింది. వెంటనే డామేజ్ కంట్రోలింగ్ చర్యలకు కూడాదిగేసింది. ”జోషి గారి కామెంట్స్ మా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం. ఏ ఒక్క కమ్యూనిటీని నిందించే ప్రయత్నం చేసినా మా పార్టీ సహించదు” అంటూ ఏఐసీసీ ప్రెసిడెంట్రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వెంటనే.. తేరుకున్న సీపీ జోషి.. తన మాటల పట్ల తానే సిగ్గుపడ్తున్నానని, వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *