లక్ష్మీనారాయణ సొంత దుకాణం..

లక్ష్మీనారాయణ సొంత దుకాణం..

సెన్సేషనల్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ పొలిటికల్ అరంగేట్రం కోసం ఆఖరి దశ కసరత్తు కూడా ముగిసిపోయింది. ఎజెండాతో పాటు.. జెండా రంగు, హంగు కూడాఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ 26న మీడియాను పిలిచి తన రాజకీయ వేదికను తానే ఆవిష్కరించుచుకుంటారని, అదే వేదిక మీద తన కొత్త పార్టీ సిద్ధాంతాల్ని కూడావివరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జనసేనలో చేరతారని కొందరు, చంద్రబాబు సానుభూతిపరుడని మరికొందరు లక్ష్మీనారాయణ మీద ‘స్టాంప్’ వేసినప్పటికీ.. ఇటీవలే ఆయన వాటన్నిటినీ తోసిపుచ్చారు. ఎవ్వరి జెండా కిందో తలదాచుకోబోనని, సొంతగా పార్టీ పెడతానని కుండబద్దలుకొట్టేశారు. వచ్చే మే నెలలోజరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, సొంత జిల్లా కర్నూల్ నుంచి బరిలో దిగుతారని కూడా ఫీలర్లు బైటికొచ్చాయి. సీబీఐలో కీలక బాధ్యతలు చేపట్టి, ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్ని ఛేదించిన లక్ష్మీనారాయణ.. తెలుగునాట నిఖార్సయిన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ‘మిస్టర్ హానెస్ట్’ పేరిట తనకున్న ఇమేజ్.. పొలిటికల్ గాఎంతవరకు ఉపయోగపడుతుందన్నది సస్పెన్స్!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *