కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలపై టీఆర్ఎస్ ఫైరయింది.. ఆయన తన ఇష్టం వచ్చినట్టు ప్రీ-పోల్ సర్వేలను రిలీజ్ చేస్తున్నారని తెరాస నేతలు ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. తెలంగాణా ఎన్నికల్లో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, అలాగే బోథ్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ గెలుస్తారని, 10 మంది స్వతంత్ర అభ్యర్థులకు గాను 8 మంది విజయం ఖాయమని లగడపాటి పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రీ-పోల్ సర్వేలను ఈసీ బ్యాన్ చేసినప్పటికీ, సర్వే రిపోర్టును తాను విడుదల చేస్తానని ఆయన ఇటీవల తిరుపతిలో ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేవరకు ప్రతిరోజూ విజయావకాశాలు గల క్యాండిడేట్ల పేర్లను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. అయితే ఇది ఈసీ ఉత్తర్వులను అతిక్రమించడమే అవుతుందని, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మేలు చేసేందుకే లగడపాటి పూనుకొన్నారని,  పైగా ఇలా చేయడంవల్ల ఓటర్లపై ఈ ప్రీ-పోల్ సర్వే ప్రభావం చూపవచ్చునని తెరాస నాయకత్వం ఆరోపించింది. ఈ ఫిర్యాదు విషయాన్ని పరిశీలిస్తానని చీఫ్ ఎలక్టోరల్ అధికారి హామీ ఇచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *