లోకేష్ చెప్పిన ఆవు కథ!

లోకేష్ చెప్పిన ఆవు కథ!

జగన్, లోకేష్ మధ్య వెర్బల్ వార్ జోరుగా సాగుతోంది. జగన్ మీద విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నాన్ని ‘కోడి కత్తి డ్రామా’గా అభివర్ణిస్తూ ఐటీ మంత్రి నారా లోకేష్ కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు అదే సీక్వెన్స్ లో మరో చెణుకు విసిరారు. గతంలో తాను పబ్లిక్ స్పీచ్ ఇస్తున్న సమయంలో జనం మధ్యనుంచి 108 అంబులెన్స్ వెళ్లడం చూసి.. దాన్ని ‘తెలుగుదేశం కుట్ర’గా భావించి ప్రభుత్వాన్ని ఎండగట్టేశారు వైసీపీ అధినేతజగన్. దానికి ఆ మరుసటిరోజే వివరణతో కూడిన కౌంటర్ ఇచ్చారు మంత్రి దేవినేని ఉమ. తాజాగా.. విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగసభలో ఒక ఆవు దూరి.. కాసేపు జనాన్ని ఇబ్బందిపెట్టింది. ఆ అవును కూడా టీడీపీవాళ్ళే పంపారంటూ జగన్ సెటైర్ వేయడంతో.. లోకేష్ తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తమ చెత్త నటనకు అవార్డులిస్తే.. దాన్ని జగన్ ఖచ్చితంగా గెలుచుకుంటారు. డ్రామాలాడడంలో ఆయన దిట్ట’ అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.. ‘108 అంబులెన్స్-ఆవు’ వీడియోల్ని కూడా పోస్ట్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *