హాలీవుడ్ స్టార్స్ డబ్బింగ్‌తో..‘ద లయన్ కింగ్ ’ ట్రైలర్

డిస్నీ సంస్థ మరో అడ్వెంచరస్ యానిమేటెడ్ మూవీని రిలీజ్ చేయబోతోంది. సిండ్రెల్లా, ద జంగిల్ బుక్, బ్యూటీ అండ్ ది బీస్ వంటి చిత్రాలు చిన్నా, పెద్దా అందర్నీ అలరించాయి. తాజాగా ఇప్పుడు ‘ ద లయన్ కింగ్ ‘ అనే సినిమా రానుంది. 1994 లో విడుదలైన యానిమేషన్ మూవీ ద లయన్ కింగ్ కే హై స్టాండర్డ్స్ జోడించి త్రీ డీ యానిమేషన్ లో ఈ చిత్రం రూపొందింది. జోన్ ఫావ్రే దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాత్రలకు హాలీవుడ్ స్టార్స్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా, 4 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. వచ్చే ఏడాది జులై 19 న ద లయన్ కింగ్ చిత్రం రిలీజ్ కానుంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *