కళ్యాణ్‌ రామ్- నివేదా థామస్-షాలిని పాండే కాంబోలో రానున్న మూవీ 118. ఈ చిత్రానికి సంబంధించి అన్నిపనులు పూర్తి కావడంతో మార్చి ఒకటిన రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. తాజాగా రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని విడుదల చేశారు. నివేదా మ‌ర్డర్ మిస్టరీగా నేపథ్యంలో ఫిల్మ్ ఉన్నట్లు కనిపిస్తోంది.

అలాగే క‌ళ్యాణ్‌రామ్ పదేపదే చెప్పే డైలాగ్స్ ఆస‌క్తిని పెంచుతోంది. శేఖర్‌చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హెల్ప్ అయినట్టు కనిపిస్తోంది. దీనికి స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అన్నీ గుహన్ కావడం విశేషం. తక్కువ టైమ్‌లో ఎక్కువ వ్యూస్ రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ! మరి కల్యాణ్‌రామ్ పడే టెన్షన్ తెలియాలంటే మార్చి ఒకటివరకు వెయిటింగ్ తప్పదన్నమాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *