మొబైల్ నెంబర్స్ సేమ్ టు సేమ్..నో చేంజ్

ఫోన్ నెంబర్లను మారుస్తున్నారని జరిగిన ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. 10 సంఖ్యలుగా ఉన్న మొబైల్ నెంబర్లను 13 కి మారుస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ వివరణ ఇస్తూ..ఈ ప్రచారం అవాస్తవమని పేర్కొంది. బీ ఎస్ ఎన్ ఎల్ కూడా మొబైల్ నెంబర్లను 13 డిజిట్లకు  మార్చే యోచన లేదని స్పష్టం చేసింది. కేవలం 13 నెంబర్లు మెషిన్ టు మెషిన్ (ఎం 2ఎం) సిమ్ లకు మాత్రమే వర్తిస్తాయని, సాధారణ సిమ్ లకు అమలు చేయడం లేదని క్లారిటీ ఇవ్వడం గమనార్హం.  దేశంలో ఇక 13 డిజిట్ల మొబైల్ నెంబర్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమలు కానుంది. అయితే సాధారణ 10 అంకెల మొబైల్ యూజర్లు అయోమయం చెందవలసిన అవసరం లేదంటున్నారు. ఇది కేవలం మెషిన్ టు మెషిన్ సిమ్ కార్డు నెంబర్లకు మాత్రమె వర్తిస్తుంది.

సెక్యూరిటీ దృష్ట్యా ఈ కొత్త పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేసిక్ కాన్సెప్ట్ అయిన ఈ విధానంలో నెంబర్ పోర్టల్ గడువు డిసెంబరు 31 తో ముగియనుంది. కాగా నెంబరింగ్ ప్లాన్ వచ్చే జులై నుంచి ప్రారంభం కానుంది. జులై 1 తరువాత 13 అంకెల మొబైల్ నెంబర్లను మాత్రమే కొత్త వినియోగదారులకు అందించనున్నారని బీ ఎస్ ఎన్ ఎల్ తెలిపింది.