ఓ వయొలెంట్ ఆన్ లైన్ గేమ్ ఆడుతూ వేగంగా వస్తున్న రైలును గమనించలేక దానికింద పడి మృత్యువాత పడ్డారు ఇద్దరు వ్యక్తులు. మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జరిగిందీ ఘటన. అది..ముంబైకి 570 కి.మీ. దూరంలోని ఖట్ కలి బైపాస్ రైల్వే స్టేషన్.. అక్కడ నగేష్ గోరె, స్వప్నిల్ అన్నపూర్ణే అనే వీరు ఆన్ లైన్ గేమ్..పీయూబీజీ..(ప్లేయర్ అన్‌నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్) ఆడుతున్నారు. మరెక్కడా చోటులేనట్టు రైలు పట్టాల వద్ద వీరు ఈ ఆట ఆడుతుండగా..వేగంగా వచ్చిన హైదరాబాద్-అజ్మీర్  రైలు వీరిని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ నెల 16 న జరిగిన  ఈ ఘటనలో వీరి శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. దీన్ని యాక్సిడెంటల్ డెత్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ కొరియా‌లో  పుట్టిన  ఈ ఆన్‌లైన్ గేమ్ చాలా డేంజరస్ అంటున్నారు.  యుద్ధ రంగంలో ఒకరినొకరు జయించడానికి  బొమ్మలు చేసే  ఫైట్ దీని  నేపథ్యం. ఈ ఆట ఆడుతున్నవారు   తమ ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలనే చూస్తారు తప్ప తమ పరిసరాలను కూడా గమనించలేరట. ఈ ఆట ఆడుతున్న 10 మందిని గుజరాత్‌లో పోలీసులు అరెస్టు చేశారు కూడా..ఇలాంటి వాటిని బ్యాన్ చేయాల్సి ఉన్నా..అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *