ఢిల్లీ కాలుష్యం.. ఇదో నరకం

ఢిల్లీ కాలుష్యం.. ఇదో నరకం

ఢిల్లీని కాలుష్య భూతం కబళిస్తోంది. వాయు కాలుష్యం నగేఅవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత ఏడాదే కాదు..ఈ సంవత్సరం కూడా సేమ్ సీన్.. అక్టోబర్, నవంబర్నెలల్లో ఇది పూర్, వెరీ పూర్, సీవియర్ కేటగిరీలకు చేరుకుంది. దీపావళి తర్వాత అయితే సీవియర్ ప్లస్ ఎమర్జెన్సీ స్థాయికి ‘ ఎగబాకింది ‘. ఈ బెడదను తట్టుకునేందుకుప్రభుత్వం గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్లాన్ (జీఆర్ఏపీ) ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాన్ ప్రకారం.. ఇక్కడి వాతావరణ కాలుష్య నివారణ బోర్డు.. సిటీలోకి ట్రక్కులప్రవేశాన్ని నిషేధించాలని, ఇటుక బట్టీలను మూసివేయాలని, బాదర్పూర్ థర్మల్ విద్యుత్ ప్లాంటును కూడా మూసివేయాలని ప్రతిపాదించారు. ఇంకా ఇలాంటివే మరికొన్నిచర్యలను తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ చర్యలన్నీ తాత్కాలికమేనని, ఇది గాయం తగిలితే బ్యాండ్ ఎయిడ్ వాడడం వంటిదేనని కాలుష్య నివారణకు కృషిచేస్తున్న స్వచ్చంద సంస్థల సభ్యులు అంటున్నారు. ఉదాహరణకు నలభై ఏళ్ళుగా ఢిల్లీకి విద్యుత్తును అందిస్తున్న బాదర్పూర్ ప్లాంట్ ను మూసివేసినా.. కొత్త ప్లాంటులుతామరతంపరగా వస్తూనే ఉన్నాయి. నగరానికి కేవలం 80 నుంచి వంద కి.మీ.దూరంలో ఉన్న ఖుర్జా సూపర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి సుమారు 1320 మెగా వాట్లవిద్యుత్తు అందుతోందని, అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు తమ పంటలను తగులబెడుతున్నారని..వారిని ఎవరు ఆపాలని ఈ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పైగాదీపావళి నాడు టపాకాయలను కాల్చడంపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినా ఎవరూ వాటిని పట్టించుకోని విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ప్లానింగ్ అన్నది పకడ్బందీగాఉంటే ఈ కాలుష్యాన్ని కొంతవరకైనా అదుపు చేయవచ్చునని, మేధావులతో సంప్రదింపులు జరిపి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలని వీరు కోరుతున్నారు.

పనిచేయకపోతే, చెప్పులివిగో.. కొట్టండి

పనిచేయకపోతే, చెప్పులివిగో.. కొట్టండి

ఇదిగో అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు,  పనిచేయకపోతే ఇవిగో చెప్పులు.. వీటితోనే కొట్టండంటూ కొత్త పంథా ఎంచుకున్నారు ఓ ప్రజాప్రతినిధి. తెలంగాణలోనికోరట్ల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆకుల హనుమంత్ అనే అభ్యర్థి ఈ కొత్త తరహా ప్రచారం మొదలు పెట్టారు. ఇంటింటికీ తిరిగి చెప్పులుపంపిణీ చేస్తూ తనను గెలిపించిన తర్వాత మీకోసం పనిచేయకపోతే ఇవే చెప్పులతో కొట్టండని గడపగడపలోనూ చెప్పుకొస్తున్నారు హనుమంత్. అతను చేస్తున్న ప్రచారంవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, కోరట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కే విద్యాసాగర్ రావు వరుసగా మూడుసార్లుగెలుపొందారు. ఆయన ప్రస్తుతం తాజామాజీగా ఉన్నారు.

అయోధ్యలో రామ మందిరం.. ముస్లిముల్లో కలవరం

అయోధ్యలో రామ మందిరం.. ముస్లిముల్లో కలవరం

యూపీలోని అయోధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మాండమైన రామ మందిరాన్ని నిర్మించాలని  మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు ఉన్న మసీదు స్థానే రాముడిగుడిని కట్టాలన్న బీజెపీ  నేతల దృఢ నిర్ణయం.తో . ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న దాదాపు అయిదు వేలమంది ముస్లిముల్లో అభద్రతా భావం నెలకొంది. గతంలోవివాదాస్పద స్థలం వద్ద తలెత్తిన పరిణామాలు పునరావృతం కావచ్చునని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ గుడిని నిర్మిస్తే ఇక తమ మనుగడ ప్రమాదంలోపడుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కాషాయ రెపరెపలు అక్కడ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశంపై చొరవచూపడం, వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్ తేవాలన్న ప్రతిపాదనకు దాదాపు అన్ని విపక్షాల మద్దతు లభించడం వీరికి నిద్ర పట్టకుండాచేస్తోంది. ఇటీవల అయోధ్యను సందర్శించిన ఓ మీడియా బృందం వద్ద అనేకమంది ముస్లిములు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారులు ఇకతాము ఈ ప్రాంతాన్ని వదిలి వేయక తప్పదని దిగాలుగా తెలిపారు. సీఎం  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా తమ రక్షణ విషయంలో ఎలాంటి హామీని ఇవ్వలేదనివాపోతున్నారు.

గ్లైడర్ కాదు..ఎలక్ట్రానిక్ విమానమే !

గ్లైడర్ కాదు..ఎలక్ట్రానిక్ విమానమే !

‘ స్టార్-ట్రెక్ ‘ సినిమా చూస్తే..చిత్ర, విచిత్రమైన ఎగిరే వాహనాలు కనిపిస్తాయి. క్షణంలో దూసుకుపోగల ఈ వాహనాలు చిన్నా, పెద్దా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇప్పుడు దాదాపు అలంటి వాహనమే రియల్ గా కనిపిస్తోంది. ఆ సినిమా చూసి స్ఫూర్తి పొందిన ‘ మిట్ ‘ రీసెర్చర్లు.. ఓ ఎలక్ట్రానిక్ విమానాన్ని రూపొందించారు. 5 మీటర్లఎత్తయిన గ్లైడర్ వంటి ఈ విమానానికి టర్బైన్లు గానీ, కదిలే విడి భాగాలు గానీ ఉండవట.  ఎగరడానికి విద్యుత్ తో అనుసంధానించిన వాయు పరమాణువులేసహాయపడతాయని వీళ్ళు చెబుతున్నారు. ఏ మాత్రం శబ్దం చేయని ఈ వింత విమానం..భవిష్యత్తులో శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే విమానాలను తోసిరాజని..వాటికిప్రత్యామ్నాయంగా నిలుస్తాయని అంటున్నారు. అలాగే దీనికి విమానాశ్రయాల అవసరం కూడా ఉండదు. ఈ బ్యాటరీ పవర్డ్ ఫ్లైట్ ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగాపరీక్షిస్తున్నారు