ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల మహాఘట్టానికి ముహూర్తం ఖరారైంది. 2019 ఫిబ్రవరి 25వ తేదీన ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 9 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 6న మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఇంకా.. జమ్ము అండ్ కశ్మీర్‌లో శాసనసభలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం 543 మంది లోక్‌సభ సభ్యుల్ని ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు.. ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 2014లో గత లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ రికార్డు స్థాయిలో మెజార్టీ కైవసం చేసుకుని కేంద్రంలో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థానాలను గెలుచుకుంది.1984 నుంచి 2014 ఎన్నికల వరకూ జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒకే ఒక పార్టీ స్వయంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని ప్రజలు ఏపార్టీకీ ఇవ్వలేదు. ఇది బీజేపీకి ఒక రికార్డు. అప్పటివరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. 26 మే 2014న భారతదేశ ప్రధానిగా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి ఎవరు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటారో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *