ఒకప్పుడు మ్యూజిక్ వినడానికి మాత్రమే వాడే హెడ్‌ఫోన్స్.. ఇప్పుడొక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. హియిర్ ఫోన్స్ లేకుండా సెల్ ఫోన్ ఉపయోగించే పరిస్థితులే లేవు. ఆధునిక సాంకేతికత మరింతగా వర్ధిల్లడంతో.. వైర్‌లెస్ హియిర్ ఫోన్స్ అనే కొత్త ఆవిష్కరణ పుట్టుకొచ్చింది. ఇదిప్పుడు ప్రీమియర్ ఫోన్ వాడకందార్లకు ఒక కంపల్సరీ యాక్సిసరీ. AirPod.. అరంగుళం సైజుండే ఈ చిన్నపాటి వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ చెవిలో ఒద్దిగ్గా అమరిపోతాయి. అందుకే ఎయిర్‌పాడ్స్ అనేది ఇప్పుడు యాపిల్ కంపెనీకి పాపులర్ ట్రెండీ హెడ్ ఫోన్.

అయితే.. ఇవేమంత క్షేమకరం కాదని, విరివిగా వాడితే క్యాన్సర్ సోకుతుందని తేల్చేశారు రీసెర్చర్లు. చెవి అంతర్భాగానికి, మెదడుకు అత్యధిక సమయం అతి సమీపంగా వుండే ఎయిర్‌పాడ్స్ కారణంగా.. క్యాన్సర్ రిస్క్ పెరిగే ప్రమాదం వుందన్నది ఒక హెచ్చరిక. వైఫై, బ్లూటూత్, సెల్ ఫోన్‌ల నుంచి వచ్చే డేటాతో.. రేడియో తరంగాలు వ్యాప్తి చెంది రేడియేషన్ సమస్యల్ని పుట్టిస్తాయట. 40 దేశాలకు చెందిన 250 మంది సైంటిస్టులు వీటిపై దండయాత్ర మొదలుపెట్టేశారు. వెంటనే వీటి వినియోగంపై నిషేధం విధించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామం ఎయిర్ పాడ్స్ తయారీదారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడేట్టు చేసింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 29 మిలియన్ల జతల వైట్ ఇయర్ బడ్స్ అమ్ముకున్న యాపిల్ సంస్థ.. వీటి మీద నిషేధం విధిస్తే ఏం చేయాలన్న సందిగ్ధంలో పడింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *