అమెరికాలో జరిగిన ఈ విచిత్రం సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ నెల 14‌న మూడేళ్ళ ఓ పాప తెలియక ఓ చిన్న నెక్లెస్‌ని మింగేసింది.  నొప్పితో అదే పనిగా ఏడుస్తుంటే ఆమె తలిదండ్రులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ రెడియోగ్రాఫ్-ఎక్స్-రే తీస్తే ఏముంది ? గొంతును, కడుపును కలిపే నాళిక-తొరాసిక్ ఈసోఫేగస్‌లో అచ్చు హార్ట్ షేపులోవున్న ఈ నగను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఏమైతేనేం ? ఎండోస్కోపీ ఆపరేషన్ చేసి ఆ నగను ఉన్నదున్నట్టు బయటకు తీశారు.

ఈ క్రమంలో ఆ చిన్నారి గొంతు భాగంలో స్వల్ప గాయాలయ్యాయని, అయితే తదుపరి చికిత్స అవసరం లేదని చెప్పి ఆ చిన్నారిని డిశ్చార్జి చేశారు. పాప ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదన్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌డీగోలో జరిగిందీ ఘటన. అందుకే చిన్నపిల్లల వద్ద ఇలాంటి వస్తువులు ఉంచరాదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా బొమ్మలు, రిమోట్ కంట్రోల్స్‌లో ఉండే బటన్ బ్యాటరీలను మింగితే చాలా ప్రమాదకరమట. ఇలాంటి ఓ బ్యాటరీని మింగి ఓ పాప మరణించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *