దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. పైగా.. విపత్తుల్లో చిక్కుకున్న అన్నార్తులను ఆదుకోవడం అనేది అంతకంటే మిన్న. ఈ ధ్యేయంతో ఏర్పడిందే హ్యూస్టన్ ఫుడ్ బ్యాంక్. హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయులు కొంతమంది కలిసి ఈ బృహత్కార్యానికి పూనుకున్నారు. ఆకలిదప్పుల్ని నిర్మూలించడం కోసం ‘హంగర్ మిటావో’ పేరుతో మిలియన్ మీల్ మార్చ్ చేపట్టారు. ఏకంగా 32 వేల మీల్స్ ప్యాకెట్స్ తయారీలో చేయీ చేయీ కలిపారు.

వాలంటీర్లలో ఒకరు మోహన్ చింతలపాటి మాట్లాడుతూ.. ”కేరళ, కర్ణాటకల్లో ఏర్పడ్డ భూకంపం, వరదల్లాంటి విపత్తుల సమయంలో ఎలా సాయం చేస్తామో.. ఇక్కడ కూడా అదే ఆశయం, అదే ఉత్సాహంతో పనిచేస్తున్నామన్నారు. 40 మిలియన్ల మంది అన్నం లేక అల్లాడుతున్నారని, వాళ్లలో కొందరి కడుపు నింపినా తమ లక్ష్యం నెరవేరినట్లని చెప్పుకున్నారు.

ఇండియన్ అమెరికన్ కౌన్సిల్ సభ్యులంతా ఒక కుటుంబంలా మారి.. ప్యాకెట్స్ తయారీలో పాల్గొనడం అక్కడివాళ్లు మనసుల్ని దోచింది. ఈ మహత్కార్యం మున్ముందు కూడా కొనసాగుతుందని మాటిచ్చారు కూడా. మార్చి 23న మరోసారి ఇటువంటి వితరణ చేయాలని సంకల్పించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *