శబరిమలలో స్వామి అయ్యప్పను ఇప్పటివరకు 50 ఏళ్ళ లోపు మహిళలు 51 మంది దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇంకా 10 నుంచి 50 ఏళ్ళ లోపు వయసున్న ఏడున్నర వేలమంది మహిళలు ఆన్‌లైన్ ద్వారా ఆలయ దర్శనం కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.  అత్యున్నత న్యాయస్థానం ఆదేశంపై 51 మంది మహిళల లిస్టును ఆయన సమర్పించారు. తమకు పూర్తి భద్రత కల్పించాలంటూ ఈ నెల 2‌న అయ్యప్పను దర్శించుకున్నఇద్దరు  మొట్టమొదటి మహిళలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలిపారు. తన మేనత్త కొట్టడంతో గాయపడిన కనకదుర్గ అనే మహిళతో బాటు బిందు అమ్మినికి కూడా 24 గంటలూ సెక్యూరిటీ కల్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *