న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి, ఆందోళన సృష్టిస్తోంది. మసీదుల్లో జొరబడి ఆగంతకులు జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో మొత్తం 49 మంది మృతి చెందినట్లు తేలింది. వీళ్ళలో కనీసం 9 మంది భారతీయులున్నట్లు ఇండియన్ రాయబార వర్గాలు చెబుతున్నాయి.

‘ఇది అమానవీయ చర్య. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.. అని ట్వీట్ చేశారు ఇండియన్ హైకమిషర్ సంజీవ్ కోహ్లీ. ఘటనను ఖండిస్తూ ప్రధాని మోదీ న్యూజీలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ కు లేఖ రాస్తూ.. ఇదొక చీకటి రోజు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా న్యూజిలాండ్‌కి సాలిడారిటీ ప్రకటిస్తూ.. బాధితులకు సాయం అందించడానికి ముందుంటామంటూ భరోసా ఇచ్చారు.

మృతుల్లో ఒక హైదరాబాదీ ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ని ఉద్దేశించి రెండు ట్వీట్లు చేశారు. ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ.. అహ్మద్ జహంగీర్ అనే హైదరాబాదీ ఒకరు మృతుల్లో వున్నాడని, వాళ్ళ ఫ్యామిలీకి ఎమర్జెన్సీ వీసాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *