బిగ్‌బాస్ షో తర్వాత ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది హీరోయిన్ ఓవియా. దీంతో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. ఈ షో తర్వాత ఆమె నటిస్తున్న ఫస్ట్ మూవీ ‘90 ఎంఎల్’. దీనికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. రిలీజైన కొద్దిగంటల్లోనే ట్రైలర్‌కి మాంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఓవియాని చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. బూతు డైలాగులు, లిప్ లాక్స్ వంటి సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ట్రైలర్‌కి మాంచి రెస్పాన్స్ వస్తోంది.

నలుగురు యువతుల జీవితానికి సంబంధించిన స్టోరీగా రానుంది ‘90 ఎంఎల్’ సినిమా. వాళ్ళ జీవితంలో ఎదురైన అనుభవాలు, ఎంజాయ్ చేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. ఓవియాని ఆయా సీన్స్‌లో చూసి జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. మరి ఆ సన్నివేశాలు కేవలం ట్రైలర్‌కే పరిమితమవుతాయా? లేదా అన్నది మూవీ రిలీజైతేనే లోగుట్టు బయటపడేది. బిగ్‌బాస్ టైమ్‌లో ఎమోషనల్‌గా కనెక్ట్ అయి తమిళనాడు అంతటా ఓవియా సంపాదించుకుంది. అంతేకాదు ఆమె కోసం ఓవియా ఆర్మీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సినిమాల్లో ఇలా కనిపించడంపై ఆమెని సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Trailer link

https://www.youtube.com/watch?v=Jl14barRz84

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *