”ఒక గ్రీన్ జ్యూస్ లాగించి అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ సొంతం చేసుకున్నాననే అల్ప సంతోషాన్ని వీడండి. వీలైనన్ని ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోండి.. అప్పుడే ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారు..” అంటూ గట్టిగా మొట్టి చెబుతోంది.. క్లోవర్ స్ట్రవుడ్ అనే పెద్దావిడ. ఐదుగురు బిడ్డల తల్లిగా ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో దిట్టంగా ఉండగలుగుతున్నానంటే.. అందుకు కారణం ఈ కూరగాయలే అన్నది ఆమె ఇస్తున్న తాజాతాజా నినాదం. ఆమె రూపొందించిన ఫుడ్ డైరీ ఇప్పుడు హెల్త్ వరల్డ్‌లో తెగ వైరల్ అవుతోంది.

‘క్యాబేజీ ఆకుల్నీ, దోసకాయ దొప్పల్ని కూడా వదిలిపెట్టకుండా వెజిటబుల్ అనిపించింది ఏదైనా లాగిస్తూ వెళ్ళండి’ అనేది ఆమె లెక్క. జేమ్స్ వాంగ్ అనే మొక్కల శాస్త్రవేత్త కూడా ఇదే మాట చెబుతున్నాడు. మన డేటుడే డైట్‌లో రోజుకు నాలుగో ఐదో కాదు పదికి తగ్గకుండా పండ్లు-కాయలు ఉండాలట. ఇలా వెజిటబుల్స్‌ని విరివిగా చేర్చడం ద్వారా వంట కూడా చీప్ అండ్ బెస్ట్‌గా తయారవుతుందన్నది వీళ్ళ అంచనా.

పోషకాహారానికి సంబంధించి క్లోవర్ స్ట్రవుడ్ ప్రతిపాదించిన సిఫార్సులు అమల్లో పెడితే దీర్ఘాయుష్షును దక్కించుకోవడం చాలా సులభమని తేలింది. సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా ఏడు రోజుల పాటు ఏమేం పండ్లు-కాయలు తినాలో సూచిస్తూ ఆమె తయారు చేసిన జాబితా.. ఒక పుస్తక రూపంలో ఆన్లైన్లో దొరుకుతోంది. ”ఈ ఛాలెంజ్‌ని నేను తీసుకున్నాను.. మీరూ రెడీనా” అంటూ సవాల్ చేస్తోందావిడ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *