అల్లు శిరీష్‌- రుక్సార్ జంటగా రానున్న మూవీ ‘ఏబీసీడీ’. దీనికి సంబంధించి ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ‘హాయ్‌ నా పేరు అవి.. జీవితంలో మూడు ‘E’ లను ఫాలో అవుతాను.. ఎంజాయ్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎగ్జైట్‌మెంట్‌’ అంటూ శిరీష్‌ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. మొదట కామిడీగా సాగింది. చివరలో పొలిటికల్ టచ్ ఇవ్వడంతో స్టోరీ ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. ‘రాజకీయం కూడా మందు లాంటిదే చక్రి, మొదలుపెడితే ఆపాలనిపించదు’ అనే డైలాగ్ బాగుంది.

అమెరికాలో పెద్ద కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి.. భారత్‌కు వచ్చి మధ్య తరగతి జీవితం గడపలేక ఎలా సతమతమయ్యాడు? అనేది కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. మాస్టర్‌ భరత్, నాగబాబు, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు నటించారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఏబీసీడీ’.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *