టాలీవుడ్ బ్యూటీ మాధవీలత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఈమె గ్లామర్ ఇండస్ర్టీ నుంచి రాజకీయాల వైపు టర్న్ అయ్యింది. ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో పోటీకి దిగారు. కొన్నినెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాధవీలత.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గుంటూరు వెస్ట్ నుంచి ఆమె బరిలో దిగారు. తనకు బీజేపీ టికెట్ కేటాయించడంతో సంతోషాన్ని వ్యక్తంచేశారు. పార్టీతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరోమారు నమో సర్కారే రావాలని కోరారు. అంతకుముందు నుంచే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టూరేశారు. ఓటర్లను కలుస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరారు. మాధవీ లత పోటీ ఇతర పార్టీల అభ్యర్థులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *