కర్ణాటక ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ నటి, దివంగత మాజీ మంత్రి అంబరీష్ భార్య సుమలత బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం  ఆమె తన మద్దతుదారులతో కలిసి బెంగుళూరులో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోడ్ షో‌లో పెద్ద సంఖ్యలో  పాల్గొనడం విశేషం.

అంబరీష్ మృతితో సుమలత రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాండ్యా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినా.. కాంగ్రెస్-జేడీ-ఎస్ మధ్య పొత్తు కారణంగా ఈ సీటును జేడీ-ఎస్‌కు కేటాయించడంతో సుమలత అసంతృప్తికి గురయ్యారు. ఇండిపెండెంటుగా నైనా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నియోజకవర్గంలో సిఎం కుమారస్వామి తనయుడు, సినీ నటుడు నిఖిల్ జేడీ-ఎస్ అభ్యర్థిగా  పోటీ చేస్తుండడంతో  ఇక్కడ పోరు కీలకంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *