టాలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్త హంగామా చేస్తోంది. నటుడిగా తనకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో అడవిశేష్. ఈ హీరోకి సంబంధించిన గాసిప్ షికారు చేస్తోంది. నాగార్జున మేనకోడలు, అలనాటి హీరోయిన్ సుప్రియను మ్యారేజ్ చేసుకోబోతున్నాడన్నది అందులోని సారాంశం. గతేడాది వచ్చిన ‘గూఢచారి’ సినిమాలో స్పై క్యారెక్టర్‌లో నటించింది సుప్రియ. నటన పట్ల ఆసక్తిచూపని సుప్రియ, అడవి శేష్ రిక్వెస్ట్ చేయడంతో తెర ముందుకు వచ్చిందని అప్పట్లో ఓ రేంజ్‌లో ప్రచారం సాగింది.

తొలుత ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కాస్తా ప్రేమగా మారిందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారని ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు. అంతేకాదు వీళ్ల ప్రేమను పెద్దల వరకు తీసుకెళ్లడానికి అన్నీ తానై వ్యవహరించిందట సమంత. వచ్చేనెలలో తాను పెద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతున్నానంటూ అడవి‌శేష్ ఇటీవల ట్వీట్ చేయడంలో బహుశా పెళ్లివార్తేనని అనుకుంటున్నారు. గతంలో పవన్‌ కళ్యాణ్‌తో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది సుప్రియ. ఆ తర్వాత అన్నపూర్ణ స్టుడియోస్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *