అమెరికాలోని పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో తమ కుమార్తెలు, కొడుకుల కోసమో, సన్నిహితులకోసమో దొంగదారిన లక్షల డాలర్లను ముడుపులుగా చెల్లించి వారికి సీట్లు పొందిన ప్రముఖుల బండారం బయటపడింది. వీరిలో ‘ డెస్పరేట్ హౌస్ వైఫ్ ‘ వంటి మూవీల్లో నటించిన ఫెలిసిటీ హాఫ్‌మన్, యూఎస్‌లోనే ప్రముఖ వ్యాపార వేత్త లోరీ లాగ్లిన్ వంటి వారున్నారు.

యేల్, స్టాన్‌ఫర్డ్, జార్జ్‌టౌన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వంటి విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా దివ్యాంగులకు ఉద్దేశించిన సీట్లను తమవారికి ఇప్పించుకునేందుకు ఈ బడా సెలబ్రిటీలు విలియం సింగర్ అనే వ్యక్తికి లంచాలు ఇచ్చారట.

కీ వాల్డ్ ఫౌండేషన్ అనే చారిటీ సంస్థ పేరిట అతగాడు వీరినుంచి సొమ్ము తీసుకున్నాడు. అయితే ఈ బాగోతం బయటపడడంతో..ఇతనితో సహా ఫెలిసిటీ హాఫ్ మాన్, లోరీ లాగ్లిన్ తదితరులను ఫెడరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా..వీరికి పెద్ద మొత్తంలో జరిమానాను కోర్టు విధించింది. మొత్తం దాదాపు 50 మందిపై కేసులు నమోదయ్యాయి. అమెరికా వంటి అగ్ర రాజ్యంలోనూ ఇలాంటి అవినీతి బాగోతాలు వెలుగులోకి రావడం విశేషం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *