రాజమౌళి లేటెస్ట్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టు ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రీసెంట్‌గా స్టోరీ గురించి క్లారిటీ ఇచ్చిన జక్కన్న.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ని తీసుకున్నట్టు చెప్పాడు. అంతే తప్ప.. ఆయన రోల్ ఏంటన్నది ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టాడు. దీంతో ఆయన బ్రిటీషర్‌గా కనపడే ఛాన్స్ వుందంటూ వెబ్ మీడియా స్టోరీలు అల్లేసుకుంది.

 

బాలీవుడ్ సమాచారం మేరకు.. ఉత్తరాదికి చెందిన ఫ్రీడమ్ ఫైటర్‌గా అజయ్ ఎంట్రీ వుండబోతోంది. సెకండాఫ్‌లో అరగంట ఎపిసోడ్‌లో ఈ హీరో విశ్వరూపం కనిపిస్తుందని చెబుతున్నారు. సినిమా అంతా ఒక ఎత్తయితే.. అజయ్‌ది మరో ఎత్తు అనే విధంగా డిజైన్ చేశాడట రాజమౌళి. మరి.. అల్లూరి సీతారామరాజు- కొమరం భీమ్‌లకు అజయ్‌ని ఎలా లింక్ చేశాడన్నదే మూవీలో కీలక పాయింట్‌. గతంలో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’లో అజయ్ దేవగణ్ నటన చూసిన తర్వాతే ఆయనకు ఈ పాత్రకు ఎంపిక చేసుకున్నాడట రాజమౌళి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *