రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టుకి సంబంధించి రోజుకో వార్త బయటకువస్తోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌‌దేవగణ్‌ గెస్ట్‌గా కనిపించనున్నట్టు టాక్. రోల్ చిన్నదే అయినా ఆసక్తికరంగా వుండనున్నట్టు సమాచారం. రాజమౌళి-అజయ్‌ మంచి ఫ్రెండ్స్. ‘ఈగ’ని హిందీలో డబ్ చేసినప్పుడు దానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు అజయ్. ఈ నేపథ్యంలో అజయ్‌కు ఛాన్స్ ఇచ్చినట్టు ముంబై సమాచారం.

మరోవైపు ఎన్టీఆర్ తన రోల్‌కి తగ్గట్టుగా దాదాపు 20 కేజీల బరువు పెరిగినట్టు తెలుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే పహిల్వాన్ తరహాలో కనిపించబోతుండట. అటు షూటింగ్ 2019 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుని 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. మార్చిలో చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసే ఛాన్స్ వుందని యూనిట్ చెబుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *