డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాశ్‌ మూడో సినిమా మొదలైంది. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఇండస్ర్టీ నుంచి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రానికి ‘రొమాంటిక్‌’ అనే టైటిల్ ఓకే చేశారు.

అనిల్‌ పాడూరి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌కి.. పూరి, స్క్రీన్‌ ప్లే, డైలాగులు, స్టోరీ అందించనున్నాడు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై ఆయన ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది ‘మెహబూబా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆకాశ్‌. పునర్జమ్మ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. రొమాంటిక్ అయినా ఆకాశ్‌కి హిట్‌ ఇస్తుందో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *