టాలీవుడ్ హీరోలు నిత్యం షూటింగ్‌లతో బిజీగా వుంటారు. కాసింత రెస్ట్ దొరికితే ఫ్యామిలీతో గడుపుతారు. కానీ, తమ దగ్గర పని చేసే స్టాఫ్ గురించి ఆలోచించేవాళ్లు తక్కువ. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కాస్త విభిన్నం. తమ సిబ్బంది పట్ల అక్కినేని కుటుంబం ఎక్కువ కన్సర్న్ చూపిస్తుందనడానికి ఇదొక ఎగ్జాంఫుల్. నటుడు అఖిల్ వద్ద పని చేస్తున్న ఓ ఉద్యోగి రెండురోజుల కిందట మ్యారేజ్ చేసుకున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరిగిన ఈ ఫంక్షన్‌కు హీరో అఖిల్ అటెండయ్యాడు. తమ బాస్‌ని చూసి ఒక్కసారిగా షాక్ కావడం ఆ ఉద్యోగి వంతైంది. కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పిన అఖిల్, వాళ్లతో దిగిన పిక్స్ వైరల్‌గా మారాయి. ఒకప్పుడు నాగార్జున ఇలాంటి సంప్రదాయం పాటించేవాడని, దాన్ని అఖిల్ అందిపుచ్చుకున్నాడని చెబుతున్నారు అక్కినేని అభిమానులు.