యువహీరో అఖిల్ కి మంచి భవిష్యత్తు ఉందని, ఏదో ఒక రోజు టాలీవుడ్ లో మంచి నటుడిగా నిలిచిపోతాడని అన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదెంతో దూరంలో లేదని జోస్యం చెప్పాడు. అఖిల్ నటించిన ‘ మిస్టర్ మజ్ను ‘ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. దర్శకుడు వెంకీ అట్లూరిని, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు.

కాగా- తారక్ దగ్గర్నుంచి అఖిల్ నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నాడు నాగార్జున. వెంకీ తీసిన ‘ తొలిప్రేమ ‘ చిత్రం చూశానని, ఆ చిత్రంతో బాటు ‘ మజ్ను ‘ ఎంతో హిట్ అయిందన్నాడు.. ఈ ఫంక్షన్ లో ఇంకా నాగచైతన్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వెంకీ అట్లూరి తదితరులు పాల్గొన్నారు. ‘ మిస్టర్ మజ్నులో అఖిల్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఈ మూవీ ఈ నెల 25 న విడుదల కానుంది. కాగా… ఈ చిత్రం ట్రైలర్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *