పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ టైంలో తళుక్కున మెరిసిన పోలండ్ మేజికల్ కుర్రాడు జెడ్ బిగినీ.. మళ్ళీ లైమ్‌లైట్‌లోకొచ్చేశాడు. స్వతహాగా మ్యూజిక్‌కి చెవులు కోసుకునే ఈ బుజ్జిగాడు.. అనిరుధ్ స్పెషల్ ‘కొడకా కోటేశ్వరరావు’ సింగిల్ పాడి నెటిజన్లకు బాగా పరిచయమయ్యాడు.

తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ అనేకసార్లు సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టేశాడు. ముద్దుముద్దుగా వచ్చీరాని తెలుగులో సినిమా పాటలు పాడి ఆకట్టుకునే బుజ్జి ఇప్పుడు మళ్ళీ గొంతు సవరించుకున్నాడు.

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి తీస్తున్న ‘మిస్టర్ మజ్ను’! ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్‌ని ఇప్పుడు ‘బుజ్జి’ ట్రై చేశాడు. ‘ఏమైనదో’ అంటూ సాగే ఈ మెలోడియస్ బీట్‌ని అద్భుతంగా పాడి అలరించాడు. ఇంత మంచి పాటనిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి హ్యాట్సాఫ్ చెబుతూ అఖిల్‌ని విష్ చేశాడు. ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చుకున్నాడు.

అఖిల్‌తో ఓనమాలు దిద్దించుకుంటున్నట్లున్న ఈ పిక్ ద్వారా ఈ బుడతడు.. తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు. ఏ హీరో సినిమా రిలీజయినా.. అందులో నచ్చిన పాటను పాడుతూ.. ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ.. టాలీవుడ్‌కి ఆత్మబంధువయ్యాడు ఈ పోలండ్ బుజ్జిగాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *