అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర చేరికల పరంపర కారణంగా నిన్నటిదాకా పెద్ద గందరగోళం నెలకొంది. నామినేషన్ల పర్వం కూడా మొదలవడంతో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నరక యాతన పడింది.. ఇప్పటికీ పడుతోంది కూడా. ఎవరు వుంటారో.. ఎవరు ఊడతారో తెలీనంత ఘోరమైన అయోమయం ఆ పార్టీది. ఇదే పరిస్థితి జనసేనకు కూడా తప్పలేదా?

ఇటీవలే బీజేపీ నుంచి విడిపడి జనసేనలో చేరారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. సతీసమేతంగా వచ్చి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారాయన. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆకులకు రాజమండ్రి ఎంపీ సీటు ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. కానీ.. సడన్‌గా ఆయన అప్‌స్కాండ్ అయ్యారన్న వార్త ఆదివారం నుంచి వినిపిస్తోంది.

రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్ కోడలు మాగంటి రూప ఈసారి టీడీపీ తరపున పోటీలో వున్నారు. ఆమె గెలుపు కోసం జనసేన పరోక్ష సహకారం చేస్తోందని.. ఆకుల సత్యనారాయణ అలక బూనినట్లు వార్తలొచ్చాయి. తనకు పార్టీ నుంచి సహకారం అందకపోవడంతో ఆవేదన చెంది ఆయన దూరంగా వున్నారట. విజయవాడలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన గైర్హాజరు కావడంతో ఈ రూమర్లకు బలం చేకూరింది.

కట్ చేస్తే.. ”నేనిక్కడే వున్నా.. ఎక్కడికీ పారిపోలేదు” అంటూ ఆకుల సత్యనారాయణ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘జనసేనకు రాజీనామా చేశానన్న వార్తలు పచ్చి అబద్ధం.. 22న రాజమండ్రి ఎంపీగా నామినేషన్ కూడా వేస్తున్నా..’ అన్నారాయన. ఇదంతా వైసీపీ చేసిన దుష్ప్రచారమేనని, పవన్ కళ్యాణ్‌కీ తనకు ఎటువంటి బేధాభిప్రాయాలూ లేవని చెప్పుకొచ్చారు ఆకుల సత్యనారాయణ. ఏదైతేనేం జనసేనలో ఒక చిన్నపాటి తుపాను వీడిపోయినట్లే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *