డిస్నీ వాల్డ్ తాజా సిరీస్ లైవ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ అలాదీన్ ‘ మూవీ ట్రైలర్ ని ఈ మధ్య గ్రామీ అవార్డుల ప్రదానం సందర్భంగా ప్రదర్శించారు. గై రిచీ  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు విల్ స్మిత్.. ‘ ల్యాంప్ నుంచి వెలువడే భూతం ‘ పాత్రలో నటించాడు. (మొదట ఒరిజినల్ రోల్ లో రాబిన్ విలియమ్స్ ఈ పాత్రలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలానికి రాబిన్ మరణించాడు). ఇప్పుడు అదే పాత్రను విల్ స్మిత్ పోషించాడు. కానీ ఈ ట్రైలర్ చూసిన వాళ్ళంతా తమ ట్విటర్లలో ఈ నటుడ్ని ఆటపట్టిస్తున్నారు.

మరీ ఇంత నీలం రంగులో ఉన్నావా అని ఒకరంటే.. ‘ మా స్కూలు బయట వీధి ఎలుకలు గుర్తుకొస్తున్నాయి ‘ అని మరొకరు జోక్ చేశారు. అలాదీన్ ఫన్నీగా ఉన్నాడని ఒకరు, ‘ అవతార్ ‘ సినిమాలు మరిన్ని తీయొద్దని జేమ్స్ కెమరూన్ ని ఇక ఎవరూ కోరబోరని మరొకరు అన్నారు. ఇలా ఇంకా చాలామంది రకరకాలుగా విల్ స్మిత్ పాత్రను హేళన చేశారు. కాగా-ఈ మూవీలో స్మిత్ తో బాటు ‘ పవర్ రేంజర్స్ ‘ స్టార్ నవోమీ స్కాట్ ప్రిన్సెస్ జాస్మిన్ గా, కెనడా నటుడు మెనా మసూద్ అలాదీన్ గా నటించారు. వచ్చే మే నెల 24 న ఈ సినిమా విడుదల కానుంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *