సూపర్-ఎర్త్.. భూమి లాంటి మరో భూమి..! పేరు Barnard b..! భూమికి దగ్గరగా వున్న రెండవ సౌరవ్యవస్థగా ఇటీవలే దీన్ని డిస్కవర్ చేశారు స్పేస్ సైంటిస్టులు. మనకు దాదాపు ఆరు కాంతి సంవత్సరాల దూరంలో వుండే ఈ అరుదైన గ్రహం గురించి మరో కొత్త వార్త బైటికొచ్చింది. ఇక్కడ గ్రహాంతర వాసుల జీవన ఆనవాళ్లు వుండవచ్చన్నది తాజా అంచనా.

సూపర్-ఎర్త్‌గా పిలువబడే మరుగుజ్జు లాంటి ఈ Barnard’s Star ఉపరితలం.. తీవ్రమైన చలితో కూడుకుని ఉంటుందని, -150°C ఉష్ణోగ్రత ఉంటుందని, దానికి తగ్గట్లుగా జియో ధర్మల్ యాక్టివిటీకి కూడా అవకాశాలున్నాయని పరిశోధనలో తేలిందట. నీటి ఆనవాళ్లు కలిగి ఉండడం, ఆ నీరు మంచులా గడ్డకట్టడం, మళ్ళీ ఆ మంచును కరిగించే ఉష్ణ క్రియకు ఆస్కారం ఉండడం.. ఈ మొత్తం సీక్వెన్స్‌ని బట్టి.. అక్కడ లైఫ్ జోన్స్‌కి ఛాన్స్ వుండవచ్చని ఒక స్థిరమైన అంచనా ఏర్పడిపోయింది.

సియాటిల్‌లోని అమెరికన్ ఆస్ట్రానమీ సొసైటీ ఈ దిశగా లోతైన అధ్యయనం చేసింది. అంటార్కిటికా ఉపరితలం మీదుండే నీటి చెలమల్లాంటివే సూపర్-ఎర్త్ మీద కూడా ఉన్నాయని, ఇవే వాతావరణ పరిస్థితుల్ని అక్కడా అన్వయించుకోవచ్చని ఎడ్వార్డ్ గునియన్ అనే ఆస్ట్రో ఫిజిసిస్ట్ చెబుతున్నారు. గతంలో జూపిటర్ గ్రహం మీద కనిపించిన ఉపరితల ఉష్ణోగ్రతలే ఇప్పుడు Barnard’s Star మీద కనిపిస్తున్నాయట. అందుకే.. అక్కడ జనావాస పరిస్థితులు ఉండవచ్చని ఖచ్చితంగా తేల్చేస్తున్నారు. 9 బిలియన్ సంవత్సరాల నాటి ఈ నక్షత్రం.. సూర్యుడి కంటే ‘పురాతన’మైనది.. సైజులో భూమికి మూడింతలు పెద్దది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *