కవచం సినిమా.. కాజల్- మెహ్రీ న్ మధ్య చిచ్చు పెట్టిందా? అవుననే అంటున్నారు సినీ లవర్స్. విభేదాల కారణంగానే ఆడియో ఫంక్షన్‌కు మెహ్రీన్ హాజరు కాలేదన్నది కొత్త వార్త. వీరిద్దరూ కలసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడడం లేదని అనుకుంటున్నారు. అసలేం జరిగింది? ఎందుకు విభేదాలొచ్చాయి? ఈ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాలు దుబాయ్‌లో షూట్ చేశారు. ఆ సమయంలో మెహ్రీన్‌తో కలసి అక్కడికి వెళ్ళడానికి కాజల్ నిరాకరించిందట. చివరకు ప్రొడ్యూసర్లు కాజల్‌ని బుజ్జగించి పంపినట్లు తెలుస్తోంది.

దీనిపై అభిమానులు రకరకాలుగా మాట్లాడుకోవడం వీటికి ఫుల్‌స్టాప్ ప్రయత్నం చేశారు ఇద్దరు బ్యూటీలు. సోషల్‌మీడియాలో ఇద్దరి మధ్య సరదాగా ట్విట్టర్‌లో సంభాషణ సాగింది. బయట విబేధాలకు ఫుల్‌స్టాప్ పెట్టినా.. లోపల మాత్రం అలాగే వుందంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎటువైపుకు దారి తీస్తుందో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *