జ్ఞాపక శక్తిని కోల్పోయే రుగ్మత దాదాపు వంశ పారంపర్యంగా సోకుతుందని వెల్లడైంది. అల్జీమర్స్ లేదా డెమెన్షియాగా వ్యవహరించే ఈ రుగ్మత తాత తండ్రులు లేక కజిన్స్‌కు ఉన్నా.. అది లేనివారికి కూడా సోకుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ డిసీజ్ ఉన్న ఇద్దరు కజిన్స్ వల్ల 17 శాతం రిస్క్ ఎక్కువగా ఉంటుందట. అంటే ఒక్కోసారి సన్నిహిత బంధువులు కూడా ఇందుకు కారణమవుతారని చెబుతున్నారు.

గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, లేదా అతి సమీప బంధువుల్లో ఎవరికీ రుగ్మత ఉన్నా మరొకరికి తప్పక పోవచ్చునని, అయితే వ్యక్తులు తమ శరీర బరువును తగ్గించుకోవడమో, లేదా బీపీని కంట్రోల్ చేసుకోవడమో చేస్తూ తమ లైఫ్‌స్టయిల్‌ని మార్చుకున్న పక్షంలో దీనికి దూరంగా ఉండవచ్చునని ఉటాలో సుమారు 3 లక్షలమందిని పరీక్షించిన రీసెర్చర్లు అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *