లాభాల పంట పండించుకుంటున్న అమెజాన్ సంస్థ పన్నులు చెల్లించడానికి మాత్రం ముఖం చాటేస్తోంది. 2017 లో ఈ కంపెనీ లాభాలు 5.6 బిలియన్ డాలర్లు ఉండగా..2018 నాటికి అది 11.2 బిలియన్ డాలర్ల మేర పెరిగిపోయింది. అయితే ఇంతగా ప్రాఫిట్స్ వస్తున్నా..ఈ ఏడాది మాత్రం ఫెడరల్ టాక్సు ల చెల్లింపునకు నిరాకరిస్తోందని ‘ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టాక్సేషన్ అండ్ ఎకనామిక్ పాలసీ ‘ తన నివేదికలో తెలిపింది.

2018 సంవత్సరానికి అమెజాన్ 129 మిలియన్ డాలర్ల ఫెడరల్ ఇన్ కమ్ టాక్స్ రిబేట్ ను చూపిందని, ఇది ఒక శాతం నెగెటివ్ టాక్స్ రేటు మాత్రమేనని పేర్కొందని ఈ రిపోర్టు వెల్లడించింది. సాధారణంగా ఫెడరల్ కార్పొరేట్ ఇన్ కమ్ టాక్స్ రేటు 21 శాతం ఉంది. భారీగా..అంటే ఒక ట్రిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినప్పటికీ అమెజాన్ పన్నుల చెల్లింపునకు నో చెప్పడం ఇది రెండో సంవత్సరమట.

పన్ను చట్టాలలోని లోపాలు, లొసుగుల కారణంగా..లాభాలపంట పండించుకుంటున్న కంపెనీలు కూడా ఈ లాభాల్లో సగం మేరకైనా పన్నులు చెల్లించకుండా నెగ్గుకొస్తున్నాయని ఈ నివేదిక పరోక్షంగా దుయ్యబట్టింది. అమెజాన్ టాక్స్ పేమెంట్ సంస్థల జాబితాలోకి రాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. ఈ సంస్థ కొన్ని పన్నులు చెల్లించింది. అమెజాన్ 2017 లో 412 మిలియన్ డాలర్లను, అంతకు ముందు..అంటే 2015 లో 273 మిలియన్ డాలర్ల మేర పన్నులను చెల్లించినట్టు తెలిసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *