మన కంటే ఒక్కోసారి మెషీన్లలోనే నిజాయితీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే.. మనలా వాటికి లాభనష్టాలు, రాగద్వేషాలు తెలీవు. చెప్పింది చెప్పినట్లు చేస్తూ ప్రోగ్రాం ప్రకారం నడుచుకుంటాయి. ఈ కోవలోకే వస్తుంది.. అమెజాన్ తాజా ఉత్పత్తి అలెక్సా. ఇదొక డిజిటల్ అసిస్టెంట్. ఇప్పుడు మార్కెట్లో వున్న గూగుల్ హోమ్ లాంటిదే. వివరాల్లోకి వెళితే..! లాస్ వెగాస్‌లో సోమవారం జరిగిన ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ టెక్నాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందన్న అంశంపై క్వాల్కామ్ అనే చిప్ తయారీ సంస్థ ప్రతినిధి డెమో ఇస్తున్నాడు. విజిటర్స్‌కి అతడు సీరియస్‌గా వివరణ ఇస్తుండగా మధ్యలో “No, that’s not true,” అంటూ అడ్డుపడింది అమెజాన్ అలెక్సా. లేనిపోని హైప్ క్రియేట్ చేయడానికి అతడు చేయబోయిన ఒక ప్రయత్నాన్ని ఈ స్మార్ట్ స్పీకర్ ఈవిధంగా అడ్డుపడిందన్న మాట. ‘ఏయ్.. అబద్ధమాడకు’ అంటూ అమెజాన్ అలెక్సా అలా అరిచేసరికి.. విజిటర్స్ అందరూ గొల్లున నవ్వేశారు. ఆ రెప్రజెంటేటివ్ నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. ఇప్పుడీ స్పైసీ క్లిప్ టెక్నో ప్రపంచంలో వైరల్‌గా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *