హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా ఈ మధ్య తెగ బిజీబిజీగా తిరిగేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా తరపున ఇక్కడి రాయబార కార్యాలయంలో డిప్లొమాటిక్ కార్యకలాపాలు చక్కదిద్దాల్సిన ఈవిడకు .. రాజకీయాల మీద ‘ప్యాషన్’ పట్టుకున్నట్లుంది. వరసబెట్టి తెలుగు రాజకీయ పార్టీ నాయకులతో భేటీ అవుతూ అదోరకం హల్చల్ క్రియేట్ చేస్తోంది.

గత జనవరి 30న ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌ని కలిసిన హడ్డా.. భారత్-అమెరికా భవిష్యత్ సంబంధాలపై ఆయన అభిప్రాయాలు తెలుసుకుని మురిసిపోయానని ట్విట్టర్లో చెప్పుకుంది.

గత ఏడాది జూన్ 9న విజయవాడకెళ్ళి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అమరావతి నగర నిర్మాణ విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు. తాజాగా.. విజయవాడలోని జనసేన కార్యాలయం చేరుకొని.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరో కీలక నేత నాదెండ్ల మనోహర్‌ని కలిశారు. ఇటీవల వీళ్ళిద్దరూ చేసిన అమెరికా పర్యటన గురించి ఈవిడ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *