ఇండియన్ స్పైసీ హీరోయిన్ల జాబితాలో మొదటి వరుసలో నిలబడే ఎమీ జాక్సన్.. ఇప్పుడు ఆస్పత్రి మంచం మీదుంది. భయపడేంత విషాద వార్తేమీ కాదు లెండి..! ఆమె త్వరలో పండంటి బిడ్డను కనబోతోంది. ఈ విషయాన్ని ఎమీనే ఇటీవల అనౌన్స్ చేసింది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. నా పొత్తి కడుపు చూశారా.. అంటూ తన గర్భానికి సాక్ష్యం చూపెడుతూ ఏకంగా ఒక ఫోటో సెషన్‌కే ఫోజిచ్చిందావిడ. ఇదీ బ్రేకింగ్ న్యూస్.

ఫియాన్సీతో కలిసి బీచ్ ఒడ్డున సరదాగా వాక్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటున్నప్పటి ఫోటోలు తనకుతానే వైరల్ చేసుకుంటోంది ఎమీ జాక్సన్. తన బేబీ బంప్‌ని చూసుకుని మురిసిపోతూ.. మీరూ మురిసిపోండి అంటూ అభిమానులతో షేర్ చేసుకుంది.

శంకర్-రజనీ మూవీ 2.0లో ఎమీ హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. బ్రిటన్ చెక్కేసి.. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయిటూతో చెలరేగి తిరిగింది. ఆ క్రమంలోనే అనుకోకుండా ‘కాలు జారడం జరిగింది’ అంటూ ఒక ‘నగ్న సత్యాన్ని’ సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు.. నాటి బలహీన క్షణానికి ప్రతిఫలం ఇదిగో.. అంటూ ‘గర్భం’ ఫొటోల్ని బైటికొదిలింది. త్వరలో డెలివరీ.. తర్వాత ఎంగేజ్‌మెంట్.. ఆ తర్వాత 2020లో పెళ్లి..! మీ అందరినీ పిలుస్తా? అంటూ హొయలు పోయింది కూడా. సో.. ఎమీ జాక్సన్ గుణవతి.. శీలవతి మాత్రమే కాదు గర్భవతి కూడా..!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *