ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో తుది ఓట‌ర్ల జాబితా విడుద‌లైంది. ఈ జాబితాని ఆ రాష్ర్ట ఎన్నిక‌ల ఎన్నికల అధికారి సిసోడియా ప్రకటించారు. ఈసారి కొత్తగా చేరిన ఓట‌ర్లు 21.24 ల‌క్షలు మాత్రమే! దీంతో ఓటర్లు సంఖ్య 3.69 కోట్లకి చేరింది. ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా వుండడం గమనార్హం. పురుషులు- 1,83,24,588 కాగా, మహిళలు- 1,86,04,742 మంది.

యూత్ విషయానికొస్తే..18-19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య అక్షరాలా 5,39,804 మంది. వాళ్లలో పురుషుల సంఖ్య మూడు లక్షలు, మహిళలు- 2,28,625 మంది. దీంతో యువ ఓట‌ర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వాళ్లదే సీఎం కుర్చీ అన్నమాట. ఇప్పడు ఏపీలో చంద్రబాబు, ఇద్దరు యువ (జగన్, పవన్) నేత‌లు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు. యూత్ అధికంగా వుండడంతో హోదా అంశం కీల‌కంగా మారింది. తాము అధికారంలోకి వస్తే హోదాపైనే తొలి సంతకం అని రాహుల్ చెప్పుకొచ్చారు. హోదా కోసమే బీజేపీ వదిలి కాంగ్రెస్ వైపుకు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఇక జగన్ విషయానికొస్తే.. 25 ఎంపీ సీట్లు గెలిపించండి, కేంద్రంలో కీలకమవుతామని అంటున్నారు. పవన్ మాత్రం ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొడుతున్నారు. హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆ తర్వాత ఫ్లేటు ఫిరాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు వలస పోతున్నారు. దీంతో యువ‌త ఏ పార్టీ వైపు అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *