ఈ సంక్రాంతి పండుగను ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఎఫ్ 2 సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమా సక్సెస్ నేపథ్యంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి, హీరోలు, తనగురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఫెయిల్యూర్‌ భయం తనకు ప్రతి క్షణం ఉంటుందన్న ఆయన.. డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాను కాని, రైటర్‌గా ఉన్నప్పుడు చాలా ఫెయిల్యూర్స్‌ చూశానన్నారు. ఇప్పుడు ఆ బాధ లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *